లబ్ధిదారులకు రూ.లక్ష చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్‌రావు
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/Minister-harish-rao.jpg)
సిద్దిపేట (CLiC2NEWS): కుల వృత్తుల వారిని బలోపేతం చేయాలని రాష్ట్ర సర్కార్ ప్రారంభించిన బిసిబంధు చెక్కులను మంత్రి హరీశ్‌రావు ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. సిద్దిపేట వయోలా గార్డెన్స్‌లో బిసి వెల్ఫేర్ ఆధ్వర్యంలో రూ. లక్ష గ్రాంట్ చెక్కులను అందజేయడానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ కులవృత్తులపై ఆధారపడిన వారందికీ ప్రోత్సాహకంగా రూ. లక్ష గ్రాంట్ అందిస్తున్నారన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవానలన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సిద్దిపేట నియోజకవర్గంలో 300 మంది లబ్దిదారులకు చెక్కులు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఆరంభమని.. నిరంతర ప్రక్రియ అని అన్నారు. దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తామని తెలియజేశారు.