ఆత్మ‌కూరు వద్ద‌ రైలు ప‌ట్టాలు దాటుతున్న త‌ల్లి, కూతురు మృతి

నెల్లూరు (CLiC2NEWS): జిల్లాలో ఆత్మ‌కూరు వంతెన వ‌ద్ద రైలు ఢీకొని త‌ల్లి, కుమార్తె మృతి చెందారు. రైలు ప‌ట్టాలు దాటుతున్న క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ముద‌రై-నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్ట‌డంతో తల్లీ, కుమార్తె అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. మ‌ర‌ణించిన వారు గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. రొట్టెల పండుగ సంద‌ర్భంగా బారాషాహీద్ ద‌ర్గాకు వ‌చ్చి తిరిగి వెళుతున్న‌స‌మ‌యంలో ప్ర‌మాదానికి గురైన‌ట్లు స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.