షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్షలు
![](https://clic2news.com/wp-content/uploads/2021/03/tspsc.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 పరీక్షలు కొనసాగుతాయని టిఎస్ పిఎస్‌సి స్పష్టం చేసింది. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-4 పరీక్షలు పూర్తయిన విషయం తెలిసిందే. గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-3 పరీక్షల తేదీలు.. కాలేజ్ లెక్చరర్స్, సంక్షేమ వసతి గృహాల అధికారులు (HWO), డివిజినల్ అకౌంట్స్ అధికారుల (DAO) పరీక్షల నిర్వహణకు సంబంధించిన పనులకు టిఎస్ పిఎస్‌సి వేగం పెంచింది. కాగా.. గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థనలు వస్తున్నాయి. మరికొంతమంది వాయిదా వేయొద్దని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారంమే గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నది. ఒక సారి పరీక్షను వాయిదా వేస్తే ఈ ఏడాది పరీక్షను నిర్వహించడం కష్టమేనని.. కనుక ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షను నిర్వహించాలని కమిషన్ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.