TTD: తిరుమ‌ల‌లో ఈసారి రెండు బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏర్పాట్లు..

తిరుమ‌ల (CLiC2NEWS): అధిక మాసం సంద‌ర్బంగా తిరుమ‌లలో ఈ సారి రెంఉడ బ్ర‌హ్మోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. తిరుల‌మ‌ల తిరుప‌తి దేవ‌స్థానం టిటిడి ఇఒ ధ‌ర్మారెడ్డి తిరుమ‌ల‌లోని బ్ర‌హ్మోత్స‌వాల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ సారి జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వాల‌కు చాలా విశిష్ట‌త ఉంద‌న్నారు. అధిక మాసం కారణంగా వార్షిక‌, న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఒకేసారి నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. సెప్టెంబ‌ర్ 18వ తేదీన ధ్వాజారోహ‌ణం ఉంటుంద‌ని తెలిపారు. రెండు సార్లు జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వాల‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఆ స‌మ‌యంలో విఐపి బ్రెక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దుచేస్తామ‌న్నారు. అయితే.. స్వ‌యంగా వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్న‌ట్లు తెలియ‌జేశారు.

ప్ర‌తి ఏడాది నిర్వ‌హించే బ్ర‌హ్మోత్స‌వాల‌ను సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలని అంటారు. ఈ ఏడాది అధిక మాసం కార‌ణంగా న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఉంటాయి. అయితే న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో ధ్వజారోహ‌ణ‌, ధ్వజావ‌రోహ‌ణాలు ఉండ‌వు. ఈ ఉత్స‌వాల ప్ర‌శ‌స్తి గురించి అన్న‌మాచార్యుల త‌న సంకీర్త‌న‌ల‌లో పేర్కొన్న‌ట్లు తెలియ‌జేశారు. అయితే 2020లో కూడా అధిక‌మాసం రాగా.. క‌రోనా కార‌ణంగా భ‌క్తుల‌ను ఎవ‌రినీ అనుమ‌తించ‌లేదు. ఈ సారి జ‌రిగే ఈ తొమ్మిది రోజుల బ్ర‌హ్మోత్స‌వాల‌కు దేశం న‌లుమూల‌ల నుండి భ‌క్తులు త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచానా వేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.