పోస్ట‌ల్ డిపార్ట్‌మెంట్‌లో 30 వేల పోస్టులు..

ఢిల్లీ (CLiC2NEWS): దేశ‌వ్యాప్తంగా త‌పాలా శాఖ‌లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు భారీ నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మే నెల‌లో 12,828 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చిన సంగ‌తి తెలిసందే. తాజాగా మ‌రో 30వేల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. గ్రామీణ డాక్ సేవ‌క్ జిడిఎస్ పోస్టుల భ‌ర్తీకి నేటి నుండి ద‌ర‌ఖాస్తులు స్వీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. ప‌దో త‌ర‌గ‌తి పాసై.. 18 నుండి 40 ఏళ్ల వ‌య‌సు లోపు ఉన్న అభ్య‌ర్థులు దర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆగ‌స్టు 23వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాలి. ఆగ‌స్టు 24 నుండి 26 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల్లో స‌వ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. ఎపిలో 1,058 పోస్టులు, తెలంగాణ‌లో 961 పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు.

ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన అభ్య‌ర్థులు మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. అభ్య‌ర్థుల‌కు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్క‌డం కూడా రావాలి. ఉద్యోగాన్ని బ‌ట్టి బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ () వేత‌న శ్రేణి రూ.12వేల నుండి రూ. 29,380.. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (ఎబిపిఎం) డాక్ సేవ‌క్‌కు రూ. 10 వేల నుండి 24,470 నిర్ణ‌యించారు.

 

Leave A Reply

Your email address will not be published.