Kothgudem: ఎఫ్ఆర్ఒ హత్యకేసు నిందితులకు జీవితఖైదు
కొత్తగూడెం (CLiC2NEWS): ఎఫ్ఆర్ఒ హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు నిందితులైన ఇద్దరికి జీవితఖైదు విధించింది. గత సంవత్సరం చంద్రుగొండ మండలం ఎర్రబోడు గ్రామంలో పోడు నరుకుతుండగా అడ్డుకున్న ఎఫ్ఆర్ఒ శ్రీనివాసరావును మడకం తుల, మిడియం నంగాలు అనే ఇద్దరు వ్యక్తులు హత్యచేశారు. ఈ కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం వారిద్దరిని దోషులుగా తేల్చి.. జీవిత ఖైదు, రూ. వెయ్యి జరిమానా విధించింది.