సామాజికి భద్రతా పథకం మరో ఏడాదిపాటు పొడిగింపు
ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు
హైదరాబాద్ (CLiC2NEWS): ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా పథకం వర్తించేలా కార్మికశాఖ 2015 నుండి అమలు చేస్తుంది. దీనికి ఖర్చయ్యే ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పథకాన్ని ప్రతి యేటా పొడిగించడం జరుగుతోంది. 2023 ఆగస్టు 5వ తేదీతో ఈ పథకం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో ఏడాది.. అంటే ఆగస్టు 4 2024 వరకు ఈ సామాజిక భద్రతా పథకం గడువు పొడిగిస్తున్నారు. ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.