చిరంజీవి వ్యాఖ్యలపై ఎపి మంత్రుల కౌంటర్లు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/miniter-botsa-and-perni-nani.jpg)
అమరావతి (CLiC2NEWS): వాల్తేరు వీరయ్య 200 రోజుల సెలబ్రేషన్స్‌లో చిరంజీవి మాట్లాడిన మాటలకు ఎపి మంత్రులు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా విడుదలై.. కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. ఒకప్పుడు సినిమాలు 100 రోజులు, 175, 200 ఆడుతుండేవని..ఇప్పటి రోజుల్లో సినిమాలు కేవలం 2,3 వారాలే ఆడుతున్నాయన్నారు. ఇలాంటి నేపథ్యంలో వాల్తేరు వీరయ్య 200 రోజులు ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఈ విజయానికి గుర్తుగా షీల్డు అందుకోవడం ఒళ్లు పులకరిస్తుందని, అలాగే చరిత్రను తిరగ రాసినట్లు అనిపిస్తోందన్నారు.
అనంతరం ఆయన రాజకీయాంశాలపై మాట్లాడుతూ..
మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ-ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలని.. పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి. అపుడే అందరూ గౌరవిస్తారన్నారు. తలవంచి నమస్కరిస్తారన్నారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటని చిరంజీవి అన్నారు.
చిరు మాటలకు స్పందించిన మంత్రి బొత్స: సినీ పరిశ్రమ ఒక పిచ్చుక అని అంగీకరించావా.. అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని..చిరంజీవి ఎందుకు వ్యాఖ్యలు చేశారో చెప్పాలన్నారు.
మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. వ్యక్తిగతంగా నేను చిరంజీవి అభిమానిని. ఒక అభిమానిగా ఆయనకు పూల దండలు వేసిన రోజులున్నాయని తెలిపారు. మేము ఏ హీరో పేరును ప్రస్తావించలేదు.. ఎవరి రెమ్యునరేషన్ ఎంతో అడగలేదన్నారు. కథకు సంబంధంలేని పాత్రలు పెట్టి .. ఒక రాజకీయ నాయకుడిని అవమానించేలా సినిమాలో సన్నివేశాలు పెట్టారు. కక్ష తీర్చుకోవాలనుకున్నపుడు అన్ని పరిస్థితులను ఎదుర్కోవాలి తప్పదు. ప్రకాశ్‌రాజ్ సినిమాలో అన్నట్లు గిల్లితే గిల్లించుకోవాలి. కానీ ఎదుటి వారుకూడా గిల్లుతారు. అది చూడలేకపోతున్నామని బాధపడితే కుదరదు.
మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ.. సినిమాల్లోకి రాజకీయం తీసుకొచ్చింది ఎవరు.. ఒక రాష్ట్ర మంత్రి అయిన అంబటి రాంబాబు పాత్ర పెట్టి, హేళన చేసింది ఎవరు.. మాకు, మా ప్రభుత్వానికి సలహాలిచ్చే ముందు తమ్ముడికి ఇచ్చుంటే బాగుండేదన్నారు.
[…] […]