అంగ‌ళ్లు ఘ‌ట‌న‌: చంద్ర‌బాబు స‌హా 20 మందిపై కేసు న‌మోదు..

అమ‌రావ‌తి (CLiC2NEWS): తెలుగుదేశం పార్టీ నేత చంద్ర‌బాబు స‌హా మ‌రో 20 మందిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అన్న‌మ‌య్య జిల్లా తంబ‌ళ్ల ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం అంగ‌ళ్లులో జరిగిన ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ముదివీడు పిఎస్‌లో కేసు న‌మోదైంది.
చంద్ర‌బాబుతో పాటు దేవినేని ఉమ‌, అమ‌ర్నాథ్ రెడ్డి రాంగోపాల్ రెడ్డి.. 20 మందిపైనే కాకుండా ఇత‌రులు అని మ‌రికొంద‌రిపై కేసు న‌మోదు చేశారు. వీరిపై హ‌త్యాయ‌త్నం, నేర‌పూరిత కుట్ర కింద కేసులున‌మోదైన‌ట్లు పోలీసులు తెలిపారు. మ‌రోవైపు ముల‌క‌ల‌చెరువు పోలీస్‌స్టేష‌న్లో కూడా చంద్ర‌బాబుపై కేసు న‌మోదైన‌ట్లు స‌మాచారం. రోడ్డు షోలో ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేశారంటూ వ‌చ్చిన ఫిర్యాదు మేర‌కు ప‌లువురు టిడిపి నేత‌ల‌పై కేసు న‌మోదు చేసిన‌ట్లు స‌మాచారం.

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని అంగ‌ళ్లులో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుండ‌గా.. వైసిపి, టిడిపి శ్రేణుల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. వారిని అడ్డుకునే క్ర‌మంలో తీవ్ర ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. ఒక‌రిపైకి ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో ప‌లువురికి గాయాల‌య్యాయి. కొత్త ప‌ల్లి ఎంపిటిసి దేవేంద్ర‌కు తీవ్ర గాయాల‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.