గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కం నిరంత‌రం కొన‌సాగే ప్రక్రియ‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కం కింద‌ సొంత ఇంటి స్థ‌లం ఉన్న‌వారికి ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ. 3 ల‌క్ష‌ల ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ గ‌డువు ఆగ‌స్టు 10వ తేదీతో ముగియ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ద‌ర‌ఖాస్తుల విష‌యంలో గ‌డువు అయిపోయింద‌ని ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. రేప‌టితో గడువు ముగియ‌నుండ‌టంతో మంత్రి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గృహ‌లక్ష్మి ప‌థ‌కం నిరంత‌రాయంగా అమ‌లు చేస్తామ‌న్నారు.

ప్ర‌తి నియోజ‌క వ‌ర్గానికి మొద‌టి ద‌శ‌లో 3000 ఇళ్లు పూర్త‌యిన త‌ర్వాత రెండో ద‌శ‌లో ఇచ్చే గృహ‌ల‌క్ష్మి కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చాన్నారు. ద‌శ‌ల వారిగా అర్హ‌లైన పేద‌లంద‌రికి ఇంటి నిర్మాణం కోసం ఈ ప‌థ‌కం అమ‌లు చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.