దిగివస్తున్న టమాటా ధరలు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/TOMATOES-IN-MARKET.jpg)
మదనపల్లె (CLiC2NEWS): గత ఐదు రోజులుగా టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి. కిలో రూ. 200, రూ.150 అమ్మిన టమాటా ఇపుడు రూ. 60, 70 లకే లభిస్తున్నాయి. మదనపల్లె మార్కెట్లో ఎ గ్రేడ్ టమాటాలు కిలో రూ. 30 నుండి రూ. 40 వరకు, బి గ్రేడ్ రూ. 21 నుండి 28 వరకు పలికింది. శుక్రవారం మార్కెట్కు 400 టన్నులకు పైడా టమాటాలు రైతులు తీసుకొచ్చినట్లు సమాచారం. వ్యాపారులు కిలో రూ.26 నుండి రూ. 37 వరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటకలోని కోలార్ పరిధిలో టమాటా దిగుబడుటు పెరిగినందున తాజాగా ధరలు తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది.