సినీ నటి జయప్రదకు 6 నెలలు జైలు శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/JAYPRADHA.jpg)
చెన్నై (CLiC2NEWS): ప్రముఖ సినీ నటి జయప్రదకు 6 నెలల జైలు శిక్షతో పాటు రూ. 5000 చొప్పున జరిమానా కూడా విధించింది చెన్నై ఎగ్మోర్ న్యాయస్థానం. ఆమెతోపాటు మరో ముగ్గురికి ఈ శిక్షను ఖరారు చేసినట్లు సమాచారం. చైన్నైకు చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి జయప్రద సినిమా థియేటర్ నిర్వహించేవారు. మొదట్లో బాడా లాభాలు వచ్చినా.. తర్వాత రాబడి తగ్గి థియేటర్ మూతపడింది. థియేటర్ నడిపే సమయంలో కార్మికుల నుండి ఇఎస్ ఐ రూపంలో కొంత డబ్బులు వసూలు చేశారు. వాటిని తిరిగి చెల్లించకపోవడంతో కార్మికులు బీమా కంపెనీనీ ఆశ్రయించారు. సదరు బీమా కంపెనీ న్యాయస్థానంను ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం థియేటర్ యాజమాన్యానికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.