వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడండి
నైగర్‌లోని భారతీయులకు అలర్ట్
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/Ministry-of-External-Affairs.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్‌లో ఉన్న భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. నైగర్‌లో ఉన్న భారతీయులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడండని పేర్కొంది. నైగర్ అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ కు వ్యతిరేకంగా తిరుగాబాటు చేసిన సైన్యం అధికారాన్ని దక్కించుకుంది. వారిపై విదేశీ శక్తులు దాడులకు సిద్దమవుతున్నాయని ఆ దేశ గగనతలాన్ని మూసివేశాయి. ఈ పరిమాణాల మధ్య శాంతి భద్రతలపై అప్రమత్తమైన విదేశాంగ శాఖ అక్కడున్న భారతీయులు వీలైనంత త్వరగా దేశం వీడాలని సూచన చేసింది.
నైగర్‌లో నెలకొన్న పరిస్థితులు కారణంగా అక్కడ ఉండాల్సిన అవసరం లేని భారతీయులు దేశం వీడాలని పేర్కొంది. దేశ గగనతలాన్ని మూసివేసిందన విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. భూమార్గంలో సరిహద్దులు దాటే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. అదేవిధంగా నైగర్‌కు వెళ్లాలని భావిస్తున్న భారతీయులు కూడా అక్కడ పరిస్థితులు గురించి పునరాలోచించుకోవాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.