స్వాతంత్య్ర దినోత్సవపు వేళ.. టిఎస్ ఆర్టిసి రాయితీలు..
హైదరాబాద్ (CLiC2NEWS): ఆగస్టు 15వ తేదీన టిఎస్ ఆర్టిసి ప్రయాణికులకు పలు రాయితీలను అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వులుగు బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్లో భారీ రాయితీని ప్రకటించింద. సినియర్ సిటిజన్లకు టికెట్లో 50% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా హైదరాబాద్లో ఒక రోజు ప్రయాణానికి సాధారణ ప్రయాణికులకు ఉండే టి-24 టికెట్ ధర రూ. 120 ఉండగా.. కేవలం రూ. 75కే ఇవ్వనుంది. పిల్లలకు రూ.80 ఉండే టికెట్ కేవలం రూ. 50 కే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ రాయితీలను ప్రయాణికులు వినియోగించుకోగలరని విజ్ఞప్తి చేశారు.