తెలంగాణలో సెప్టెంబర్ 17 నుండి బిజెపి బస్సుయాత్ర..!
హైదరాబాద్ (CLiC2NEWS): ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రజలతో మమేకమవటానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర తరహాలో సెప్టెంబర్ 17 నుండి బస్సు యాత్రకు సిద్దమవుతోంది. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలను 3 క్లస్టర్లుగా విభజించి యాత్ర చేపట్టనుంది. ఒక్కొక్క క్టస్టర్‌కు ఒక కీలక నేత నేతృత్వం వహించేలా యోచన చేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ కార్యదర్శి బండి సంజయ్, ఈటల రాజేందర్ యాత్రలకు సారథ్యం వహించనున్నట్లు సమాచారం.