వరంగల్ జిల్లాలో ఆటోను ఢీకొన్న లారీ.. ఆరుగురు దుర్మరణం
![](https://clic2news.com/wp-content/uploads/2022/11/accident.jpg)
వరంగల్ (CLiC2NEWS): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద వద్ద ఆటోను ఎదురుగా వస్తున్నా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా రాజస్థాన్, బిహార్‌కు చెందిన కూలీలు. తేనె విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరంతా వరంగల్ నుండి తొర్రూరు వైపు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రలును ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని వరంగల్ సిపి రంగనాథ్ పరిశీలించారు.