5శాతం వడ్డీతో రూ.లక్ష రుణం: కేంద్రం
సెప్టెంబర్ 17 నుండి పిఎం విశ్వకర్మ పథకం
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/MONEY-IMAGE.jpg)
ఢిల్లీ (CLiC2NEW): పిఎం విశ్వకర్మ పథకం కింద సంప్రదాయ వృత్తుల వారికి రూ. లక్ష రుణం అందజేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రవేశపెట్టనున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా ఒబిసి వర్గానికి చెందిన 18 రకాల వర్గాకలు లబ్ధి చేకూరుతుంది. దాదాపు 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.