కాంగ్రెస్‌కు మరో షాక్.. బిఆర్ఎస్‌లో చేరిన భద్రాచలం నేత తెల్లం వెంకట్రావు
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/Tallam-venkatrao-joined-in-brs.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): మాజి ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో పాటు భద్రాచలం నేత తెల్లం వెంకట్రావు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఆయన బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో తిరగి బిఆర్ ఎస్‌లో చేరారు. అనంతరం కెటిఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ ఎస్ ను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులకు పట్టాలు ఇచ్చారా.. రైతుబంధు, రైతుభీమా కాంగ్రెస్ ఇస్తుందా.. ఏం చూసి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ సంక్షేమ పథకాలు అందని కుటుంబం లేదన్నారు. వరద నివారణకు శాశ్వత కరకట్టలు కడతాం.. ఒక్కసారి అవకాశం ఇవ్వండని కాంగ్రెస్ అడుతోందన్నారు. అధికారంలోకి రామని తెలిసే కాంగ్రెస్ హామీలు ఇవ్వడంపై కెటిఆర్ స్పందించారు. 50 ఏళ్లు అధికారంలో ఉండి ఏంచేశారని ప్రశ్నించారు.