ఎల్‌బినగర్ పిఎస్‌లో ఇద్దరు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/LB-NAGA-PS.jpg)
హైదరాబాద్ (CLiC2NEW): నగరంలోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బినగర్ పోలీస్ స్టేషన్ లోని హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సిపి డిఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 15 రాత్రి 11 గంటలకు ఇంటికి వెళుతున్న మహిళను పోలీసు వాహనంలో ఎక్కించుకుని.. రాత్రంతా స్టేషన్‌లో ఉంచి, లాఠీలతో కొట్టారని, తెల్లవారే వరకూ స్టేషన్‌లోనే ఉంచారని బాధితురాలు తెలిపింది. ఆమె తరపు బంధువులు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అయితే ఈ ఆరోపణలు నిజం కావని ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై ఎల్‌బినగర్ డిసిపి సాయిశ్రీ దృష్టికి వచ్చినట్లు.. విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.