APPSC: గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల..
తొలి మూడు ర్యాంకులు మహిళా అభ్యర్థులవే
అమరావతి (CLiC2NEWS): ఎపిలో గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. తొలి మూడు ర్యాంకులు మహిళా అభ్యర్థులే సాధించారు. గురువారం సాయంత్రం ఎపిపిఎస్సి ఛైర్మన్ గైతమ్ సవాంగ్ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల చేశారు. ఎపిపిఎస్సి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. మొత్తం 111 గ్రూప్-1 పోస్టులకు 259 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది జాబితాను విడుదల చేశారు. వీరిలో 39 మందిని స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేశారు. ఒక పోస్టు నియామకంపై త్వరలక్ష ప్రకటిస్తామని ఛైర్మన్ తెలిపారు. మొత్తం 16 విభాగాల్లో 110 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జరిగింది.
టాప్ 5 ర్యాంకర్స్ వివరాలు..
మొదటి ర్యాంకు భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష
రెండవ ర్యాంకు భూమిరెడ్డి భవాని
మూడవ ర్యాంకు కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న
నాలుగో ర్యాంకు ప్రవీణ్ కుమార్ రెడ్డి
ఐదవ ర్యాంకు భాను ప్రకాష్ రెడ్డి