వరుసగా రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ అంతిమ్
మొట్టమొదటి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/WORLD-CHAMPION-ANTIM.jpg)
ఛండీగర్ (CLiC2NEWS): హరియాణాకు చెందని అంతిమ్.. వరుసగా రెండుసార్లు అండర్ -20 ప్రపంచ ఛాంపియన్ షిప్లో బంగారు పతకాలు సొంతం చేసుకొని మొట్ట మొదటి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. హరియాణా, హిసార్ జిల్లాలోని భాగన గ్రామం నుండి వచ్చిన 19 ఏళ్ల అంతిమ్ పంగాల్ అండర్ -20 ప్రపంచ ఛాంపియన్ షిప్లో 53 కేజీల విభాగంలో పసిడి పతకం సాధించింది. ఆమె కిందటేడాది కూడా అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించింది.
అంతిమ్ పంగాల్ తండ్రి రామ్ ఒకప్పుడు కబడ్డీ ఆడేవాడు. ఆమె పెద్దక్క కూడా కబడ్డీ క్రాడాకారిణి. వీరిది మధ్యతరగి కుటుంబం. అంతిమ్‌కు ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. చివరి అమ్మాయి పేరు అంతిమ్ అని పెడితే తర్వాత అబ్బాయి పుడతాడని అక్కడి వారి నమ్మకం. అదే విధంగా తనకు తమ్ముడే పుట్టాడు. అర్పిత్.. ఇతను కూడా అక్కతో పాటు రెజ్లింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. రాష్ట్ర అండర్-15లో కాంస్యం సాధించాడు. అంతిమ్ 11 ఏళ్లకే తనకంటే సీనియర్లతో తలపడేది. ఆట కోసం అబ్బాయిల్లా జుట్టు మార్చకుంది. రోజుకి 8 గంటలు ప్రాక్టీస్‌లోనే ఉండేది. 201జలో అండర్-15 జాతీయ టైటిల్ గెలిచింది. నేషనల్ లెవల్, ఆసియా స్థాయి పోటీల్లో తన సత్తా చాటింది.