పింఛ‌న్ల పెంపుపై త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న: సిఎం కెసిఆర్‌

సూర్యాపేట (CLiC2NEWS): ముఖ్య‌మంత్రి కెసిఆర్ సూర్యాపేటకు వ‌రాలు ప్ర‌క‌టించారు. ఆదివారం జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నూత‌న భ‌వ‌నాలను ప్రారంభించారు. జిల్లా క‌లెక్ట‌రేట్‌, స‌మీకృత వ్య‌వ‌సాయ మార్కెట్‌, జిల్లా ఎస్పి కార్యాల‌యం, మెడిక‌ల్ కాలేజి, బిఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాల‌యాన్ని సిఎం ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బిజెపి నేత‌లు ఒక్క అవ‌కాశం ఇమ్మ‌ని అడుగుతున్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉండి ఏంచేశార‌ని ప్ర‌శ్నించారు. సూర్యాపేట‌, భువ‌న‌గిరి, న‌ల్గొండ‌లో మెడిక‌ల్ కాలేజీలు పెట్టాల‌ని ఎపుడైనా అనుకున్నారా.. ఈ జిల్లాలు అప్పుడెలా ఉన్నాయి. ఇపుడెలా ఉన్నాయాన్నారు. ఎన్నిక‌లు రాగానే కొత్త బిచ్చ‌గాళ్ల లాగా మాయ‌మాటలు చెబుతున్నార‌ని, వాటిని ప్ర‌జ‌లు న‌మ్మెద్దని విజ్ఞ‌ప్తి చేశారు.

వృద్యాప్య పింఛ‌ను రూ. 4వేలు ఇస్తామ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నార‌ని.. వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో రూ. 4వేలు ఇస్తున్నారా అని ప్ర‌శ్నించారు. మేం కూడా పింఛ‌న్లు త‌ప్ప‌కుండా పెంచుతామ‌న్నారు. కానీ ఎంతవ‌ర‌కు పెంచుతామో త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

సూర్యాపేట‌కు సిఎం కెసిఆర్ వ‌రాల జ‌ల్లు కురిపించారు. ప్ర‌తి గ్రామానికి రూ. 10 ల‌క్ష‌లు, జిల్లాలోని 4 మున్సిపాలిటీల‌కు రూ. 25 కోట్లు, సూర్యాపేట మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నాన‌న్నారు. రూ. 25 కోట్ల‌తో సూర్యాపేట‌తో క‌ళాభ‌వ‌న్ నిర్మాస్తామ‌న్నారు. సూర్యాపేట‌లో ఆర్ అండ్‌బి గెస్ట్‌హౌస్ నిర్మించాల‌ని మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డిని ఆదేశిస్తున్నా అని ముఖ్య‌మంత్రి తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.