బిఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..
రెండు చోట్ల నుండి పోటీ చేయనున్న సిఎం కెసిఆర్
![](https://clic2news.com/wp-content/uploads/2023/05/CM-KCR.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని బిఆర్ ఎస్ పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం ప్రకటించారు. అభ్యర్థులలో పెద్దగా ఎటువంటి చేర్పులు చేయలేదని తెలుస్తోంది. కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేసినట్లు సమాచారం. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. గోషామహాల్, నర్సాపూర్, నాంపల్లి, జనగామ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన జరగలేదు. సిఎం కెసిఆర్ కామారెడ్డి, గజ్వేల్.. రెండు స్థానాలనుండి బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
BRS CANDIDATES FIRST LIST