సూడాన్‌లో అంతర్యుద్ధం.. ఆకలితో ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు..
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/CHILDREN-WERE-DEAD-IN-SUDAN.jpg)
కైరో (CLiC2NEWS): సూడాన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం ఫలితంగా అక్కడి ప్రజలకు నీరు, విద్యుత్ సౌకర్యాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక మంది చిన్నారులు ఆకలికి అలమటించిపోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు దాదాపు 500 మంది చిన్నారులు మృత్యువాత పడినట్లు సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్చంద సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా పోషకాహార లోపంతో వేల సంఖ్యలో బాధపడుతున్నట్లు సమాచారం.
సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ను సైన్యంలో విలీనం చేసేందుకు ప్రతిపాదన రూపొందించబడింది. దీంతో ఆర్మీ- పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలకు తెరలేచింది. ఏప్రిల్ 15వ తేదీన మొదలైన ఈ అంతర్యుద్ధంలో అనేక మంది అశువులుబాశారు. దాదాపు 4వేల మంద మృతి చెందినట్లు ఐక్యరాజ్య సమితి విభాగాలు పేర్కొన్నాయి. దాదాపు 44 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు లేదా ఇతర దేశాలకు తరలిపోయినట్లు అంచనా వేసింది.