నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 17 మంది మృతి

ఐజ్వాల్ (CLiC2NEWS): మిజోరం రాజ‌ధాని న‌గ‌రం ఐజ్వాల్‌కు 21 కిలో మీట‌ర్ల దూరంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఐజ్వాల్‌కు స‌మీపంలోని సైరంగ్ వ‌ద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కూలిపోయి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాద స‌మ‌యంలో 35 నుండి 40 మంది కూలీలు విధులు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మ‌రి కొంత మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటార‌ని భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌నపై ముఖ్య‌మంత్రి జొరామ్‌థంగా తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు రైల్వే శాఖ మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌టించింది. ఈ ఘ‌ట‌న‌లో మృతి చెందిన కుటుంబాల‌కు రూ. 10 లక్ష‌లు, క్ష‌త‌గాత్రుల‌కు రూ. 2 లక్ష‌లు చొప్పున ఎక్స్‌గ్రేషియో చెల్లించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. స్వ‌ల్పంగా గాయ‌ప‌డిన వార‌కి రూ. 50 వేలు చొప్పున ప‌రిహారం చెల్లించ‌నున్నారు. ప్ర‌మాద స్థ‌లంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.