జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన చంద్రయాన్-3
భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది: ప్రధాని మోడీ
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/CHANDRAYAN-3.jpg)
చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్
ప్రపంచంలోనే తొలిసారిగా జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ -3 విజయవంతంగా ల్యాండయ్యింది. 41 రోజుల ప్రయాణం అనంతరం విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్‌గా ల్యాండ్ అయింది. రోవర్ చంద్రుడిపై రెండు వారాలపాటు పరిశోధనలు చేయనుంది. దక్షిణ ధ్రువంపై ఉన్న మట్టిని అన్వేషించనున్నది. చంద్రుడిపై కాలుమోపిన నాల్గవ దేశంగా భారత్ నిలిచింది. అంతేకాకుండా దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధాని నరేంద్ర మోడీ అమితానందం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న మోడీ వర్చువల్‌గా ప్రయోగాన్ని వీక్షించారు. ఈ ప్రయోగం విజయవంతమైన వెంటనే ఆయన జాతీయ జెండా ప్రదర్శించారు. ఇస్రో శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా. భారత్ సరికొత్త చరిత్ర సృష్టించిందన్నారు. ఇలాంటి అద్భుత విజయంకోసం దేశ ప్రజలందరూ ఎదురు ఉత్కంఠంగా ఎదురుచూశారన్నారు.