వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మృతి!
మాస్కో (CLiC2NEWS): గత కొన్ని నెలలుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ యుద్ధకాలంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన రష్యా ప్రవేటు సైన్యం అయిన వాగ్నర్ గ్రూప్ చీఫ్ యొవెనీ ప్రిగ్రోజిన్ దుర్మరణం పాలయ్యారు. ఈ మేరకు రష్యాకు పలు మీడియా సంస్థలు వార్తాకథనాలు వెలువరించాయి. రష్యాలోని తెవర్ రీజియన్‌లో ప్రయాణికులతో కూడిన విమానం కూలిపోయిన ఘటనలో ప్రిగ్రోజిన్ కూడా ఉన్నట్లు రష్యా ఏవియేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రమాదానికి గురైన విమానం మాస్కో నుంచి సెయింట్ పీటర్స్ బర్గ్ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.