త‌మిళ‌నాడులో రైలు ప్ర‌మాదం.. 9 మంది మృతి

మ‌ధురై (CLiC2NEWS): త‌మినాట ఘోర రైలు ప్ర‌మాదం చోటుచేసుకుంది. మ‌ధురైలో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో 9 మంద్రి మృత్యువాత ప‌డ్డారు. లఖ్‌న‌పూ నుంచి రామేశ్వ‌రం వెళ్తున్న స్పెష‌ల్ ట్రైన్‌లో గ్యాస్ సిలిండ‌ర్ పేలి భారీగా మంట‌లు చెల‌రేగాయి. ఈ ప్ర‌మాదంలో ప‌లు బోగీలు ద‌గ్ధ‌మ‌య్యాయి. దీంతో 9 మంది మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డిన వారిని స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాగా టీ చేసుకునే ప్ర‌య‌త్నంలో సిలిండ‌ర్ పేల‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. రైలు కోచ్‌లోకి ఒక ప్ర‌యాణికుడు ర‌హ‌స్యంగా సిలిండ‌ర్ తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.