AP: వైజాగ్‌లో కుంగిన కొత్త బస్ షెల్టర్
విశాఖపట్నం (CLiC2NEWS): వైజాగ్ కార్పోరేషన్‌లో నిర్మించిన మోడ్రన్ బస్ షెల్టర్ కుంగింది. కార్పోరేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బస్ షెల్టర్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయి కుంగిపోయింది. ఈ ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఎవరు లేకపోవడం ప్రమాదం తప్పింది. కాగా దాదాపు రూ. 40 లక్షలతో నిర్మించిన బస్ షెల్టర్ ఐదు రోజు కిందట నగర్ మేయర్ ప్రారంభించారు. ప్రారంభించిన ఐదు రోజులకే కుంగిపోవడంతో నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.