నిర్మల్‌లో కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
నిర్మల్ (CLiC2NEWS): జిల్లాలోని మామడ మండలంలో 44వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు మరమ్మతులు చేస్తున్న కూలీలపైకి లారీ వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. నాగ్‌పూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీ బూరుగుపల్లి సమీపంలో వేగంగా టిప్పర్‌ను ఢీకొట్టింది. టిప్పర్ కూలీలపైకి దూసుకెళ్లింది. ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో లారీ క్లీనర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.