AP: స్కూళ్లలో మొబైల్ ఫోన్లు నిషేధం
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/not-use-phones-in-schools.jpg)
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ సర్కార్ పాఠశాలల్లో మొబైల్ పోన్లు వాడడంపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లలో ఇకపై మొబైల్ ఫోన్లను వాడకంపై నిషేధం విధిస్తున్ననట్లు ఎపి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా ఫోన్లను తీసుకురాకుండా ఆంక్షలను విధించింది. పాఠశాలలో ఉపాధ్యాయులు తరగతి గదికి వెళ్లే ముందు తమ ఫోన్లను ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని పేర్కొంది.
బోధనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు ముందుగానే ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన తర్వాతనే ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు విద్యాశాఖ తెలిపింది. కాగా నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపింది.