వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి!

ఆర్‌ఆర్‌ఆర్‌: రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చిన రామ్‌ చరణ్‌

ఎన్టీయార్ అభిమానుల ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. `ఆర్ ఆర్ ఆర్ లో త‌మ అభిమాన క‌థానాయ‌కుడు ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్ కోసం ఆశ‌గా చూస్తున్న వారికి చిత్ర బృందం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. `రామరాజు ఫర్ భీమ్` వీడియోను విడుదల చేశాడు. `ఆర్ఆర్ఆర్`లో కొమరం భీమ్‌గా చేస్తున్న ఎన్టీయార్ పాత్ర తీరుతెన్నులను పరిచయం చేస్తూ ఈ వీడియోను రూపొందించారు.

 

`వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండ్రు బెబ్బులి.. కొమురం భీమ్` అంటూ రామ్‌చరణ్ వాయిస్ ఓవర్‌తో ఎన్టీయార్ పాత్రను పరిచయం చేశారు. ఎన్టీయార్ పోరాట వీరుడిగా అద్భతంగా కనిపించాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.

 

జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాలో అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురమ్‌ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి సంబంధించి రామ్‌చరణ్‌ రిటర్న్‌ గిప్ట్‌ ఇచ్చారు. రామరాజు వాయిస్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశాడు.

 

Leave A Reply

Your email address will not be published.