బ‌స్సు డ్రైవ‌ర్ ర్యాష్ డ్రైవింగ్‌.. ట్రాఫిక్ సిఐ అత్యుత్సాహం!

జీడిమెట్ల (CLiC2NEWS): ట్రావెల్ బ‌స్సు డ్రైవ‌ర్‌పై ట్రాఫిక్ సిఐ వెంక‌ట్‌రెడ్డి అత్యుత్య‌హం ప్ర‌ద‌ర్శించిన ఘ‌ట‌న జీడిమెట్ల‌లో చోటుచేసుకుంది. శ‌నివారం రాత్రి ఐడిపిఎల్ చౌర‌స్తా వ‌ద్ద జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌ధాన ర‌హ‌దారిపై ఓ ప్రైవేటు ట్రావెల్ బ‌స్సు ఆగింది ఆ స‌మ‌యంలో అక్క‌డ ట్రాఫిక్ నియంత్రిస్తున్న సిఐ డ్రైవ‌ర్ ను బ‌స్సు దిగాల్సిందిగా కోరారు. ఆ వెంట‌నే డ్రైవ‌ర్ ను కాలితో త‌న్ని, మొహం పై దాడి చేశాడు. ఈ తతంగం అంతా ఆ ప‌రిస‌ర ప్రాంతంలో ఉన్న ఓ వ్య‌క్తి త‌న సెల్‌ఫోన్ లో షూట్ చేశాడు. ఆ విడియోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో చెక్క‌ర్లు కొడుతున్నాయి.

కాగా ఈ ఘ‌ట‌న‌ను జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ వెంక‌ట్‌రెడ్డి మాట్లాడుతూ.. “ ర్యాష్‌గా బ‌స్సును డ్రైవ్ చేస్తున్న‌ట్లు ట్రాఫిక్ సిబ్బంది గుర్తించారు. బ‌స్స ఆపే ప్ర‌య‌త్నం చేసినా డ్రైవ‌ర్ వేగంగా ముందుకు తీసుకువెళ్లాడు. రంగాభుజంగా చౌర‌స్తా, కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ చౌర‌స్తా వ‌ద్ద బ‌స్సును ఆపేందుకు ప్ర‌య‌త్నించినా ట్రాఫిక్ పోలీసుల‌ను లెక్క చేయ‌లేదు. చివ‌ర‌కు ఐడిపిఎల్ చౌర‌స్తాలో బ‌స్సును ఆపేలా చేశాం. దాంతో డ్రైవ‌ర్ దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. మీరు చాలాను వేసుకోండి.. బ‌స్సును ఎందుకు ఆపారంటూ పోలీసుల‌తో వాగ్వాదానికి దిగాడు. అంతేకాకుండా ఓ ద‌శ‌లో సిబ్బందిపై దాడికి య‌త్నించాడు. దీంతో అత‌న్ని అడ్డుకునేందుకు అలా ప్ర‌వ‌ర్తించాల్సివ‌చ్చింది“ అని సిఐ వివ‌ర‌ణ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.