మరో మూడు రోజులు విస్తారంగా వర్షాలు..

హైదరాబాద్ (CLiC2NEWS): ఎడతెరిపిలేని వర్షాలతో తెలంగాణలోని జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. వర్షాలు, వరదల మూలంగా ఎలాంటి ప్రాణనష్టం జరకుండా అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సిఎస్ సూచించారు.
భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు చెరువులు నిండుకున్నాయని… వాటికి గండ్లు పకుండా తగిన చర్యలు చెపట్టాలని సూచించారు. వరదల మూలంగా జరిగే నష్టాన్ని నివారించేందుకు సంబంధింత మండలస్థాయి రెవెన్యూ, పంచాయతిరాజ్ తదితర అధికారులతో తరచూ టెలీకాన్ఫరెన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాలన్నారు. కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సిఎస్ సూచించారు.