ప్రముఖ కవి, రచయిత, గాయకుడు జయరాజ్‌కు కాళోజి అవార్డు

హైదరాబాద్ (CLiC2NEWS): 2023 సంవత్సరానికి గాను కాలోజి అవార్డుకు ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ ఎంపికయ్యారు. ప్రతి ఏటా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కృషి చేసిన వారికి ఇచ్చే కాళోజి నారాయణరావు అవార్డు.. ఈసారి గాయకుడు జయరాజ్‌ను వరించింది 2023 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం జయరాజ్‌ను ఎంపిక చేశారు. ఈ నెల 9వ తేదీన కాళోజి జయంతి సందర్భంగా ఈ అవార్డును అందిస్తారు. ఈ అవార్డు కింద రూ. 1,01,116 నగదు, జ్ఞాపికను అందజేస్తారు.
మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ చిన్నతనం నుండి పేదరికంతో ఎన్నో కష్టాలను అధిగమించి.. కవి, రచయిత, గాయకుడుగా గుర్తింపు పొందాడు. జయరాజ్ తెలంగాణ ఉద్యమ కాలంలో తన ఆట, పాట, గానంతో ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని రగిలించారు. ప్రకృతి గొప్పదనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం పలుపాటల రచనలు చేశారు. మనిషికి, ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు.