ఈ నెల 22వరకు చంద్రబాబుకు రిమాండ్ విధించిన కోర్టు..
రాజమహేంద్రవరం జైలుకు చంద్రబాబు

విజయవాడ (CLiC2NEWS): ఎసిబి కోర్టు చంద్రబాబుకు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ ఎసిబి కోర్టులో చంద్రబాబు అరెస్ట్‌పై వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు ముగిసాయి. ఇదువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబుకు రిమాండ్ విధించారు.
చంద్రబాబుకు రిమాండ్ విధించిన వెంటనే చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు తరలిచనున్నట్లు సమాచారం.