జైల‌ర్ మూవి స‌క్సెస్.. గిప్ట్స్ పంచుతున్న నిర్మాత‌..

ర‌జ‌నీకి బిఎండ‌బ్ల్యూ, డైరెక్ట‌ర్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌కు పోర్సే...

చెన్నై (CLiC2NEWS): సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన జైల‌ర్ చిత్రం మంచి విజ‌యాన్నందుకున్న విష‌యం తెలిసిందే. నిర్మాత‌కు పెట్టిన పెట్టుబ‌డి క‌న్నా రెండింత‌లు లాభాలు చేకూరాయి. ఈ క్ర‌మంలో నిర్మాత క‌ళానిధి మార‌న్‌ అంద‌రికీ గిప్ట్స్ పంచుతున్నాడు. అంతే కాకుండా చిన్న పిల్ల‌ల గుండె చికిత్స‌ల‌కు సైతం కొంత మేర సొమ్మును అంద‌జేశాడు. తాజాగా 300 మందికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వ‌డం హాట్ టాపిక్‌గా మారింది. హీరో ర‌జ‌నీకాంత్‌కి బిఎండ‌బ్ల్యూ, డైరెక్ట‌ర్ నెల్స‌న్ – మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌కి ఖ‌రీదైన పోర్సే కార్ల‌ని గిప్ట్స్‌గా ఇచ్చాడు.

Leave A Reply

Your email address will not be published.