జైలులో చంద్రబాబు భద్రత ప్రభుత్వానిది.. బొత్స సత్యనారాయణ
విజయనగరం (CLiC2NEWS): స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న విషయం తెలిసిందే. జైల్లో ఆయన భద్రత విషయంపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కల్పించే భద్రతపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ఏదైనా లోపం జరిగితే దానికి తాము పూర్తి బాధ్యత వహిస్తామని తెలిపారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేయరాదని.. ఈ కేసులో ఆయన ప్రమేయం లేదని చంద్రబాబు నిరూపించుకోలన్నారు.
మరోవైపు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలుగువారు సైతం నిరసనలు తెలుపుతున్నారు. ఆయన త్వరగా బయటకు రావాలని పెద్ద ఎత్తున భారీ ర్యాలీలు, దీక్షలతో తమ నిరసనలు తెలుపుతున్నారు.