నల్గొండ జిల్లాలో బైకును ఢీకొన్న కారు.. ఐదుగురు మృతి

చింతపల్లి (CLiC2NEWS): నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. బైక్‌పై ఉన్న ముగ్గురు, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద బుధవారం ఈ ప్రమాదం చోటుచోసుకుంది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రసాద్ అతని భార్య రమణమ్మ, కుమారుడు అవినాష్ ప్రమాదంలో మరణించారు. ప్రసాద్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బైక్‌ను ఢీకొట్టిన కారు బోల్తాపడటంతో కారులో ఉన్న నలుగురికి గాయలయ్యాయి. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇద్దరు మృతి చెందారు. మణిపాల్ , మల్లికార్జున్‌లుగా గుర్తించారు. మరో ఇద్దరిని హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.