కృష్ణా జిల్లాలో దంపతుల హత్య!

మొవ్వ (CLiC2NEWS): కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యా భర్తలను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మొవ్వ మండలం అయ్యంకి పంచాయితీ కార్యాలయం వద్ద జరిగింది. వీరంకి కృష్ణను హత్య చేసిన దుండగులు అతని భార్యను నడిరోడ్డుపై కిరాతకంగా చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న కూచిపూడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షలు కారణంగా ఈ హత్యలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ హత్యలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.