కెనడా పౌరులకు వీసా సర్వీసులు నిలిపివేత!

ఢిల్లీ (CLiC2NEWS): భారత్, కెనడాల మధ్య ఖలిస్థానీ అంశంలో ఉద్రిక్తలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాలన జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. నిర్వహణ కారణాలతో సెప్టెంబర్ 21 నుండి తదుపరినోటీసు వచ్చే వరకు భారత వీసా సర్వీసులు సస్పెండ్ చేశారు అని ఓ ప్రైవేటు ఏజెన్సీ తమ వెబ్సైట్లో ఈ విషయాన్ని ప్రకటించింది. కేంద్ర విదేశాంగ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చి భద్రతీపరమైన పరిస్థితుల కారణంగానే కెనడియన్లకు వీసా సర్వీసులను నిలిపివేసినట్లు ధ్రువీకరించారు.
ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్‌కు సంబంధం ఉందనడానికి బలమైన ఆరోపణలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వాఖ్యలు చేశారు. దీంతో కెనడా, భారత్ మధ్య వివాదం మొదలైంది. ఈ హత్య విషయంలో భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా.. అక్కడ మన దైత్యవేత్తపై బహిష్కరణ వేటు వేసింది. ఈ క్రమంలో భారత్ కూడా మన దేశంలో కెనడా రాయబారిని బహిష్కరించింది. ఇంకా మన దేశనుండి కెనడా వెళ్లాలనుకునే వారిని సైతం అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ కూడా జారీ చేసింది.