IND vs AUS: ఆసీస్ ముందు 400 పరుగుల భారీ లక్ష్యం

ఇండోర్ (CLiC2NEWS): భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ కొనసాగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ మందు 400 భారీ లక్ష్యాన్ని ఉంచింది. వన్డేల్లో ఆసీస్ భారత్‌కిదే అత్యధిక స్కోరు. శుభ్‌మన్ గిల్ 104, శ్రేయస్ అయ్యర్ 105 శతకాలతో రాణించారు. రాహుల్, 52, సూర్యకుమార్ యాదవ్ 72 ఆర్ధశతకాలు సాధించారు. వీరు తొలి మ్యాచ్‌లో కూడా ఆర్థశతకాలతో మెరిశారు.