సింగరేణి కార్మికులకు శుభవార్తనందించిన సర్కార్

హైదరాబాద్ (CLiC2NEWS): సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్ తెలిపింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వచ్చిన లాభాల్లో 32% వాటా చెల్లించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా రూ. 700 కోట్ల లాభాలను చెల్లించనున్నారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ రికార్డు స్థాయిలో రూ. 2,222 కోట్ల లాభాలను ఆర్జించింది.