`వినాయక నిమజ్జనం` కోసం అదనపు బస్సులు, మెట్రో, ఎంఎంటిఎస్ రైళ్లు
![](https://clic2news.com/wp-content/uploads/2023/09/metro-bus-mmts.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్ నగరంలో గణేశ శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. నగరంలో కొనసాగుతున్న గణేశ నిమజ్జనంకోసం తరలివచ్చే భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ 535 అదనపు బస్సులను నడుపనుంది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో జరగే నిమజ్జనోత్సవాల కోసం తరలి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ బస్సులను నడుపనుంది. బుధవారం రాత్రి 11 గంటలనుంచి శుక్రవారం ఉదయం 4 గంటల వరకు ఎంఎంటిఎస్ అదనపు రైళ్లను నడుపనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 8 ఎంఎం టిఎస్ రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించారు. అలాగే శుక్రవారం ఉదయం (తెల్లవారు జామున) 2 గంటలకు పలు మార్గాల్లో మెట్రో రైళ్లను నడుపనున్నట్లు మెట్రో రైల్ ఎండి ఎన్వీ ఎస్ రెడ్డి ప్రకటించారు.
జలమండలి
భక్తుల సౌకర్యార్థం వారికి తాగునీటి కోసం పలు ఏర్పాట్లు చేసినట్లు జలమండలి ఎండి దానకిశోర్ తెలిపారు. 122 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మొత్తంగా 34 లక్షల వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించారు.
వైద్యారోగ్యశాఖ
నిమజ్జనంకోసం వచ్చే భక్తుల కోసం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 37 వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. వెంకట్ తెలిపారు. 15 ప్రైవేటు ఆసుపత్రుల భాగస్వామ్యంతో పలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. గణేశ నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులో ఉపయోగించడానికి 108 అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలీసు శాఖ
కాగా హైదరాబాద్‌లో నిమజ్జనం కోసం పోలీసు యంత్రాంగం దాదాపు 40 వేల మంది పోలీసులను మోహరించారు. ఉద్రిక్తతలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. నగరంలో శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
[…] […]