హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
![](https://clic2news.com/wp-content/uploads/2023/09/ms-swaminathan_clic2news.jpg)
చెన్నై (CLiC2NEWS): ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత్ హరిత విప్లవ పితామహుడు, ఎంఎస్ స్వామినాథన్ (98) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనరోగ్యంతో బాధపడుతున్న స్వామినాథన్ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారత దేశంలో ఆహార ఉత్పత్తుల అభివృద్ధికోసం ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. స్వామినాథన్ ఆగస్టు 7 వ తేదీ 1925వ సంవత్సరంలో తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆయన సేవలకు భారత్ ప్రభుత్వం 19678లో పద్మశ్రీ, 1972లో పద్మవభూషన్, 1989లో పద్మవిభూషన్ అవార్డుతో సత్కరించింది. అలాగే అత్యంత ప్రతీష్టాత్మకమైన రామన్‌మెగసెసె అవార్డు 1971లో ఆయన్ను వరించింది.
1972-79 మధ్య కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహించారు. ఫారెస్టు సర్వే ఆఫ్ఇండియాలో కీలక పాత్ర పోషించారు. 1979లో కేంద్ర సర్కార్ స్వామినథన్ ను వ్యవసాయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.