గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి
![](https://clic2news.com/wp-content/uploads/2023/09/kairathabad-Maha-Ganapathi.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదరుచూస్తున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఇవాళ (గురువారం) మధ్యాహ్నం 1.30 నిమిషాల ప్రాంతంలో హుస్సేన్ సాగర్ జాలాల్లో మహాగణపతి నిమజ్జనం కన్నుల పండువగా జరిగింది. ఈ సుందర దృష్యాలను చూసేందుకు నగర ప్రజలు భారీగా తరలివచ్చారు. ఖైరతబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం నెక్లెస్ రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసి భారీ క్రెయిన్నం. 4 వద్ద మహాగణపతి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ ఎంసి సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. మహాగణపతి నిమజ్జనం చూసేందుకు ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది.
హైదరాబాద్ నగరంలో గణేశ శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది.
నగరంలో హుస్సేన్ సాగర్ తో సహా దాదాపు 100 ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. గణేశుడి నామ స్మరణతో మార్మోగుతున్న హైదరాబాద్ నగర వీధులు..
ఖైరతాబాద్ మహాణపతి శోభాయాత్ర ఇవాళ (గురువారం) ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 1.30 నిమిషాల ప్రాంతంలో హుస్సేన్‌సాగర్‌లో భారీ గణనాథుడు నిమజ్జనం పూర్తి అయింది. కాగా నగరంలోని పాతబస్తీ, సికింద్రాబాద్‌నుంచి భారీగా తరలిస్తున్న వినాయకులు.
కాగా హైదరాబాద్‌లో నిమజ్జనం కోసం పోలీసు యంత్రాంగం దాదాపు 40 వేల మంది పోలీసులను మోహరించారు. ఉద్రిక్తతలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. నగరంలో శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
తప్పకచదవండి: `వినాయక నిమజ్జనం` కోసం అదనపు బస్సులు, మెట్రో, ఎంఎంటిఎస్ రైళ్లు
[…] […]
[…] […]