కర్ణాటక బంద్.. స్తంభించిన జనజీవనం.. 44 విమానాలు రద్దు
![](https://clic2news.com/wp-content/uploads/2023/09/karnataka-bandh.jpg)
బెంగళూరు (CLiC2NEWS): రైతుసంఘాలు ఇచ్చిన రాష్ట్ర బందు మేరకు శుక్రవారం కన్నడ నాట జనజీవనం స్తంభించింది. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు అక్కడ బందు కొనసాగుతోంది. బందు సంపూర్ణంగా కొనసాగుతోంది. స్వంచ్ఛందంగా కన్నడ నాట బందుకు మద్దుతు లభిస్తోంది. బంద్‌తో అక్కడ హోటళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. అక్కడి రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆటోలు, టాక్సీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చివరకు యాప్ ఆధారిత టాక్సీ, ఆటో సేవలు కూడా నడవడం లేదు. దాంతో రోడ్లన్నీ నిర్మాణుష్యంగా ఉన్నాయి. చివరకు ఈ బందు విమాన రాకపోకలపై కూడా పడింది. ఏకంగా బెంగళూరు విమానాశ్రయంలో 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. టాక్సీలు లేకపోవడంతో అధిక సంఖ్యలో విమాన ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవడంతో ఈ విమానసర్వీసులు రద్దయినట్లు తెలుస్తోంది.
రైతులకు మద్దతుగా కన్నడ నాట పలు సంఘాలు మద్దతుగా నిలిచాయి. దాంతో శుక్రవారం ఉదయం నుంచే బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. పలు చోట్ల రాష్ట్ర సర్కార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పలుచోట్ల 144 సెక్షన్ విధించారు.