పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 52 మంది మృతి

బ‌లుచిస్థాన్ (CLiC2NEWS): పాకిస్థాన్‌లో భారీ పేలుడు సంభ‌వించి 52 మంది మృతి చెందారు. ఓ మ‌సీదు ప్రాంగ‌ణంలో శ‌క్తివంత‌మైన బాంపు పేలుడు సంభ‌వించింది. ఈ ఘ‌ట‌న ఆత్మాహుతి దాడిగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు స‌మాచారం. మిలాద్ ఉన్ న‌బిని పుర‌స్క‌రించుకుని మ‌సీదులో ర్యాలీ నిర్వ‌హిస్తుండ‌గా.. ఒక్క‌సారిగా పేలుడు జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 50మందికి పైగా తీవ్ర‌గాయాలైన‌ట్లు స‌మాచారం. ఈ ప్ర‌మాదంలో డిఎస్‌పి న‌వాజ్ గాష్కోరి మృతి చెందిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఆయ‌న ర్యాలీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో భాగంగా విధులు నిర్వ‌హిస్తున్నారు. ఆయ‌న కారు ప్రక్క‌నే పేలుడు సంభించింది. అయితే ఈ ఘ‌ట‌న ఆత్మాహుతి దాడిగా ప్రాథ‌మిక నిర్ధారించారు. ఓ సూసైడ్ బాంబ‌ర్ డిఎస్‌పి కారు ప‌క్క‌నే నిల‌బ‌డి త‌న‌ను తాను పేల్చేసుకున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఘ‌ట‌న‌ స్థలంలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.