మాకు రాముడైనా. కృష్ణుడైనా ఎన్టీఆరే: మంత్రి కెటిఆర్
ఖమ్మం (CLiC2NEWS): ఖమ్మం పట్టణంలోని లకారం టాంక్‌బండ్‌పై కొత్తగా ఏర్పాటు ఎన్టీఆర్ పార్కును, ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని మంత్రులు కెటిఆర్, పువ్వాడ అజయ్ కుమార్ లు ఆవిష్కరించారు. ఇక్కడ రూ. 1.37 కోట్లతో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… తెలుగు ప్రజల మనసులో చెరగని ముద్ర వేసిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. మాకు కృష్ణుడు, రాముడు ఎలా ఉంటారో తెలియదు.. రాముడైనా కృష్ణుడైనా మాకు ఎన్టీఆరే అని మంత్రి అన్నారు. ఇవాళ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టమని అన్నారు. ఎన్టీఆర్ శిష్యుడిగా సిఎం కెసిఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పారని మంత్రి కెటిఆర్ అన్నారు.