Marriguda: ఎంఆర్ ఓ ఇంట్లో ఎసిబి సోదాలు.. రూ. 2కోట్లకు పైగా నగదు స్వాధీనం
నల్గొండ (CLiC2NEWS): జిల్లాలోని మర్రిగూడ ఎంఆర్ ఓ ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఎంఆర్ ఓగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ రెడ్డికి ఆదాయానికి మించి ఆస్థులు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు వనస్థలిపురంలోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. భారీగా నగదు, బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 2 కోట్ల నగదు పెట్టెలలో బయటపడింది. ఇవే కాకుండా ఇంకా స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను సైతం అధికారులు గుర్తించారు. ఎంఆర్ ఓ ఇంటితోపాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.